పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు ప్రత్యేక కృషి

Spread the love

పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పనకు ప్రత్యేక కృషి

విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు

రాష్ట వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు

కర్నూలు, నవంబర్ 11: పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశు సంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, పాలసీలను అమలుచేయడం వల్ల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్ లో మెల్ స్టార్ ఏవియేషన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ ద్వారా వాణిజ్య, ప్రైవేట్ పైలట్ లకు శిక్షణ ఇచ్చే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ DGCA ఆమోదిత కోర్సులు.. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ప్రైవేట్ పైలట్ లైసెన్స్ , మల్టీ ఇంజన్ రేటింగ్, ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనుందన్నారు. మొదటి దశలో రెండు ఎకరాల్లో రూ.100 కోట్లతో ఈ సంస్థ ఏర్పాటవుతోందని, ఈ సంస్థ ద్వారా విమానయాన రంగంలో నైపుణ్య అభివృద్ధికి దోహద పడటమే కాకుండా, రాష్ట్రం పైలట్ శిక్షణలో ప్రముఖ కేంద్రంగా తయారు కానుందని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా మొదటి దశలో వంద మందికి ప్రత్యక్షంగా, 250 పరోక్షంగా ఉపాధి లభించనుందని, రెండవ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జూలై నాటికి నిర్మాణాలు పూర్తి చేసి వంద మందికి శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శర వేగంగా సాగుతోందని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక హక్కు ద్వారా అనేక పరిశ్రమలు, డ్రోన్ సిటీ లాంటి ప్రాజెక్టులు రావడం వల్ల యువతకు విరివిగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం వల్ల విదేశాలకు పైలట్ ట్రైనింగ్ వెళ్ళే అవసరం తగ్గుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని తెలిపారు. ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు వల్ల విమానయాన రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, మెల్ స్టార్ ఏవియేషన్స్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ కశ్యప్, సెట్కూరు సీఈఓ డా.వేణు గోపాల్, కర్నూలు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యా సాగర్, డిఐఓ ప్రవీణ్ రెడ్డి, డీఈ అమృత్ తదితరులు పాల్గొన్నారు.

Loading