పదవుల కన్నా- ప్రజా సేవ ముఖ్యమని రాజకీయాలంటే స్వార్థం కోసం కాదు- సమాజ శ్రేయస్సు కోసమని

Spread the love

 పదవుల కన్నా- ప్రజా సేవ ముఖ్యమని

రాజకీయాలంటే స్వార్థం కోసం కాదు- సమాజ శ్రేయస్సు కోసమని

ఆశయాల కోసం అశువులు బారిన నేత వంగవీటి మోహన రంగా కి ఘనంగా నివాళులర్పిస్తున్నాం పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సిపి నాయకులు.

బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా వంగవీటి మోహన రంగా నిరంతరం కృషి చేశారు అందుకే వారు ఆ వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

రంగా లాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ మాలాంటి ఉద్యమ నాయకులు సమాజ హితం కోరే వారే చూపగలరు. 

నాడు నేడు నేను ప్రతిపక్షంలోనే ఉన్నా రంగా విషయంలో నా స్వరం మారదు.

 రాధాకృష్ణ నాడు ప్రతిపక్షంలో నేడు అధికార పక్షంలో ఉన్నారు. రాధాకృష్ణ రంగా అభిమానుల బాధ్యత తీసుకోవాలి. 

వంగవీటి మోహన రంగా పేరు మీద జిల్లా ఏర్పాటు, ఒక పథకానికి పేరు మరియు స్మృతి వనం ఏర్పాటు చేయించే బాధ్యత రాధాకృష్ణ పైనే ఉంది. ఎందుకంటే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి దగ్గర మనిషి అని అందరికీ తెలుసు. 

రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని చాలామంది నాయకులు వాడుకుంటున్నారు కానీ వారి అభివృద్ధి సంక్షేమంపై కూడా రాధాకృష్ణ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఈ కార్యక్రమంల కార్యక్రమంలో ఆవాల మారుతి, కొరగంజి వెంకటరమణ, మద్దిల రామకృష్ణ, బత్తుల పాండు, పొట్నూరి శ్రీనివాసరావు, అడ్డూరి తమ్మరావు, షేక్ షాహినా, ఎం హనుమాన్, సిగ్నం శెట్టి రాము గుప్తా, నేమాల సంజీవరావు, బందే చూడు శ్రీనివాసరావు, తవ్వ మారుతి, నూనె సోమశేఖర్, సాబింకర్ నరేష్, పైలా పవన్, సుఖాసి భాను, పిల్లా శంకర్, తమ్మిన రఘు, బంగారు నూకరాజు ,సోమీ మహేష్, లండా ప్రశాంత్ తమ్మిన అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *