పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

Spread the love

ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.
తేది.30.09.2025.

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయం.
ఇన్ని రోజులు చట్టాలకు అనుగుణంగా విధులు నిర్వహించారు, మనమంతా ఒకే పోలీసు కుటుంబం.
పోలీసు డిపార్ట్మెంట్ లో ప్రజా సేవకే మీ సమయం, శక్తి అన్ని వినియోగించినందుకు డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు….డిప్యూటీ పోలీసు కమిషనర్ ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్.

ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి, కర్తవ్య నిర్వహణలో చిత్తశుద్ది, అంకిత భావంతో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలందించి ది.30.09.2025 తేదిన పదవీ విరమణ చేసిన నలుగురు పోలీస్ అధికారులను పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరలు డి.సి.పి. ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్. ఇతర పోలీస్ అధికారులతో కలిసి సుదీర్ఘకాలం పాటు పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినందుకు గాను పదవీ విరమణ చేసిన అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు.

పదవీవిరమణ పొందిన వారి వివరాలు :
క్ర.సం పేరు హోదా విధులు నిర్వహణ

(1) జి.వేంకటేశ్వర రావు, సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు తిరువూరు పి.ఎస్.

(2) ఎస్.జయరాం, సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, సి.ఎస్.బి

(3) ఎస్.ఆంజనేయులు హోంగార్డు 2 టౌన్ పి.ఎస్.

(4) డి. శ్రీనివాస రావు హోంగార్డు గవర్నర్ పేట పి.ఎస్

ఈ సంధర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ...  పదవీ విరమణ చేస్తున్న అధికారులంధరికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాధములు తెలియజేశారు.  ఈ నేపధ్యంలో ప్రతి ఒక్క అధికారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. పదవీ  విరమణ చేసిన అధికారులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 24 గంటలూ ఉద్యోగ వీధి నిర్వహణలో బాగంగా చాలా బిజీగా గడిపారు. ఇప్పటి నుండి ఒక్కసారిగా ఖాళీ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక అధ్యాత్మిక పరంగా వెళ్లడమో లేదా ఏదో ఒక వ్యాపకం చూసుకోవాలి అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు.

 అనంతరం పధవీ విరమణ చేసిన అధికారులను అభినందించి పోలీస్ మర్యాదలతో శాలువాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికినారు. 

ఈ కార్యక్రమంలో ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి  ఐ.పి.ఎస్.  ఆర్.ఐ.లు   శ్రీనివాసరావు  సుధాకర్ రెడ్డి  సూపరిండెంట్  లక్ష్మణరావు  ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం. సోమయ్య, అసోసియేషన్ సంఘ సభ్యులు మరియు అధికారులు,  సి.పి.ఓ. సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *