
పటిష్ట ప్రణాళికతో ధాన్యం సేకరణ: ఆర్‌డీవో కావూరి చైతన్య
పటిష్ట ప్రణాళికతో రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నట్లు విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య తెలిపారు. శనివారం ఆర్‌డీవో చైతన్య విజయవాడ గ్రామీణం, నిడమనూరులో పర్యటించారు. ధాన్యాన్ని ఆరబెట్టే ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్‌కే)తో పాటు వివిధ సమన్వయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని.. వారి సహాయంతో రైతులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల క్షేమం, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ వివిధ కార్యక్రమాలు, పథకాలు అమలుచేస్తోందని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![]()
