పటిష్టమైన బంధోబస్త్ నేపధ్యంలో క్యూ లైన్స్ లను స్వయంగా పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.30.09.2025.

పటిష్టమైన బంధోబస్త్ నేపధ్యంలో క్యూ లైన్స్ లను స్వయంగా పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్

  శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. జిల్లా కలెక్టర్  లక్ష్మి శా ఐ.ఎస్.ఎస్. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగింది. మూలా నక్షత్రం  సందర్భంగా మరో 1400 మంది సిబ్బందితో 200 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తులలో ఎక్కడా తొక్కిసలాట జరుగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి ధర్శనం అయ్యేవిధంగా బందోబస్త్ ను ముందు రోజు అర్ధ రాత్రి నుండి స్వయంగా పర్యవేక్షించడం జరిగింది.

దసరా మహోత్సవాల నేపద్యంలో మిగిలిన రోజులలో భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి ధర్శనం నిమిత్తం వస్తారన్న అంచనా మేర ఈ రోజు నగర పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. జిల్లా కలెక్టర్  లక్ష్మి శా ఐ.ఏ.ఎస్ ఇతర పోలీసు అధికారులతో కలిసి బస్ స్టాండ్, మున్సిపల్ కార్యలయం, సీతమ్మ వారిపాధాలు, వినాయక టెంపుల్ పరిసర ప్రాంతాలలోని హోల్డింగ్ ఏరియా లను, క్యూ లైన్స్ లను నడుచుకుంటూ పరిశీలించి అదికారులకు తగు సూచనలు అంధించారు.నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు ఎవ్వరూ నదిలోనికి వెళ్లకుండా కేవలం జల్లు స్థానాలు వినియోగించే విధంగా బంధోబస్త్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కేశఖండన శాల పరిసర ప్రాంతాలలో రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు పంపించే విధంగా సిబ్బంది తగు సూచనలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నీ వసతులు అందుతున్నాయ లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనించి వెంటనే సంబందిత అదికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. జిల్లా కలెక్టర్ లక్ష్మి శా ఐ.ఏ.ఎస్. మున్సిపల్ కమిషనర్  ధ్యాన్ చంద్ డి.సి.పి.లు  కె.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్ ఎస్.వి.డి.ప్రసాద్ ఏ.డి.సి.పి.  జి రామ కృష్ణ సౌత్ ఏ.సి.పి. పావన్ కుమార్  రామచంద్ర రావు , ఇతర శాఖల అదికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *