
విజయవాడ నగరపాలక సంస్థ
20-11-2025
పటమట హై స్కూల్ రోడ్ లో ఆక్రమణల తొలగింపు
విజయవాడ నగరపాలక సంస్థ కే. సంజయ్ రత్నకుమార్ అదేశాల మేరకు నగర పరిధిలో గల పటమట లోని హై స్కూల్ రోడ్లో ఉన్న ఆక్రమణలను గురువారం తొలగించారు విజయవాడ నగరపాలక సంస్థ ప్రణాళిక సిబ్బంది.
ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ మాట్లాడుతూ పటమట హై స్కూల్ రోడ్లో 80 అడుగుల రోడ్డు ఉందని, ఇరువైపులా 20 అడుగుల వరకు ఆక్రమణలు ఉన్నాయని, వాటిని అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తమ సిబ్బందితో తొలగించి 80 అడుగుల రోడ్డు పునరుద్ధరించారని తెలిపారు. దాదాపు పది ఆక్రమణలు, అనధికార పార్కింగ్ తొలగించినట్లు వివరించారు.
నగర పరిధిలో అనధికారకంగా నిర్మాణాలు చేసిన, ఆక్రమించిన పట్టణ ప్రణాళిక సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు తొలగిస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.సామ్రాజ్యం, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కమల్, సిబ్బంది పాల్గొన్నారు.
![]()
