నేరస్తులు నేరం చేసేందుకు భయపడాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి

3
0

నేరస్తులు నేరం చేసేందుకు భయపడాలి

ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సైబర్ నేరాలను అరికట్టాలని నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా నేర నియంత్రణ సాధ్యమేనని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సురక్ష 360 సీ సీ టీవీ కెమెరాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ వంగల పూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ,
సహచర ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, కోలికపూడి శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య,విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని
పోలీసులకు సురక్ష 360 డివైన్ కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ
సీసీ కెమెరాల నిఘా తో నేరస్తులు
తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని అందుకు అవసరమైన సీసీటీవీ కెమెరాలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలన్నారు. తన వంతు బాధ్యతగా పశ్చిమలో 30 లక్షల రూపాయల విలువైన సీసీ కెమెరాలను అందచేశానని తెలిపారు.. తద్వారా
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు భయపడాలన్నారు.
మహిళలు పోలీస్ స్టేషన్ కి రావడానికి సంకోచిస్తారని అట్లాంటి వారికి సైబర్ కమాండోలు దోహదం చేస్తాయన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు వంటి విప్లవాత్మక మార్పులు రావాలని సూచించారు
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికను ఉపయోగిస్తూ
నేరాల నియంత్రణకు
ప్రత్యేక చొరవ చూపుతూ ప్రజల రక్షణ కోసం
సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీశ లను ను సుజనా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here