నేత్రపర్వంగా శ్రీ కోదండ సీతారామస్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం.వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

Spread the love

 నేత్రపర్వంగా శ్రీ కోదండ సీతారామస్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం.వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 30.06.2024

జి.కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోదండ సీతారామస్వామి వారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. వేకువజామునే స్వామివార్ల మూలవిరాఠ్‌లకు విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సున్నంపాడులోని ఆలయానికి విచ్చేసిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) కూడా పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు._*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *