నేడు NDA మేనిఫెస్టో విడుదల
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో నేడు విడుదల కానుంది.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు CBN, పవన్, ఇతర బీజేపీ నేతలు మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
పెన్షన్లు రూ.4వేలకు పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, మెగా డీఎస్సీపై మొదటి సంతకం, వాలంటీర్ల వేతనం రూ. 10వేలకు పెంపు వంటి హామీలతో NDA అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.