నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్

Spread the love

 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆమె… ప్రస్తుతం ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆమె భర్త అనిల్ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 
కవితను ఈడీకి ఏడు రోజుల కస్టడీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఈరోజు ఆమె రెండో రోజు విచారణ జరగనుంది. ఈడీ కార్యాలయంలో ఉన్న కవితను అనిల్, కేటీఆర్, హరీశ్ రావు, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. దాదాపు గంటకు పైగా వీరు భేటీ అయ్యారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో వారు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడకుండానే వీరు వెళ్లిపోయారు. నిన్నటి ఈడీ విచారణలో కవితకు ఈడీ అధికారలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆమెను విచారించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *