నేటి అవసరాలు తీరుస్తాం.రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుంది

Spread the love

 నేటి అవసరాలు తీరుస్తాం.రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుంది

ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణం – 30 ఏప్రిల్ 2024

మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్ర నేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుందని ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య స్పష్టం చేసారు. మంగళవారం నాడు నందిగామ పట్టణం 4,5,6 వార్డుల్లో ఇంటింటికీ విస్రృత పర్యటన చేపట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి వివరించి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ, ‘నేటి అవసరాలు తీరుస్తాం… రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం’ అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుందన్నారు. అప్పులు, పన్నుల బాదుడుతో కాకుండా సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామన్నది కూటమి ఆలోచన అని వివరించారు.

రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒకో పథకం, కార్యక్రమం ఉంటాయన్నారు. లబ్ధిదారుల, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్‌ జరిగిందన్నారు

రాష్ట్రం మీద, ప్రజల మీద మమకారం ఉండాలి. ఇవి చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి సంపదను పెంచి చూపించారని, జగన్‌కు ఇందులో ఒక్కటి కూడా లేవు అని ఎద్దేవా చేసారు. అందుకే ఉన్న వృద్ధి కూడా దిగజారిందని విమర్శించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *