07-10-2024
ఎన్టీఆర్ జిల్లా
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించిన వివరాల నివేదికను అందజేయాలని సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన హాజరయ్యారు
నిషేధిత భూముల జాబితా నుంచి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినవి, చట్టాన్ని ఉల్లంఘించిన వాటి పూర్తి వివరాలను నివేదికలో స్పష్టంగా అందజేయాలని సీసీఎల్ఏ జాయింట్ సెక్రెటరీ వివరించారు. ఇప్పటికే సమర్పించిన వివరాలను పునఃపరిశీలించాలని ఆమె సూచించారు. రిజిస్ట్రేషన్ జరిగిన భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలన్నారు.
కాన్ఫరెన్స్ లో భూ సేకరణ సెక్షన్ సూపర్డెంట్ దుర్గాప్రసాద్ ఉన్నారు