అమరావతి…
టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయడంపై ప్రభుత్వం ఫోకస్.
నిర్మాణాలకు అవసరమైన రుణాల మంజూరు కొరకు బ్యాంకర్ లతో సమావేశమైన మంత్రి నారాయణ.
సమావేశానికి హాజరైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,టిడ్కో ఎండీ సునీల్ రెడ్డి,పలు బ్యాంకుల అధికారులు.
గతంలో ఇళ్లు పంపిణీ చేయకుండా లోన్లు ఇచ్చిన వాటికి సంబంధించిన పెండింగ్ బకాయిలు(NPA)121 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.
బ్యాంకులకు బకాయిలు చెల్లించడంతో కొత్త రుణాలు,పెండింగ్ వాయిదా నిధులు విడుదల చేయాలని కోరిన మంత్రి నారాయణ.
టిడ్కో ఇళ్ల ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న మంత్రి.
గత ప్రభుత్వం మొత్తం పథకాన్ని గందరగోళానికి గురి చేసిందన్న మంత్రి
365 చ.అడుగులు,430 చ.అడుగుల విస్తీర్ణంలో నీ ఇళ్లను త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని కోరిన మంత్రి.
లోన్లు తీసుకున్న లబ్ధిదారులు కూడా సకాలంలో వాయిదాలు తిరిగి చెల్లించాలని కోరిన మంత్రి