విజయవాడ నగరపాలక సంస్థ 30-05-2025 నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలి
సెంట్రల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలి అని సెంట్రల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ నందు సెంట్రల్ నియోజకవర్గం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అందుకు అనుగుణంగా ప్రతి ఏ ఈ ఆర్ వో తన పరిధిలో గల పోలింగ్ స్టేషన్లలో ఉన్న కాలేజీలలో ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసి ప్రతిరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసే ప్రక్రియను చేయాలని అధికారులను ఆదేశించారు. నమోదైన ప్రతి ఒక్కరికి పీ.వీ.సీ ఓటర్ కార్డ్ వారికి అందేటట్టు చర్యలు తీసుకోవాలి అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో కూడా ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం ఓటర్ నమోదు ప్రక్రియను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు అందేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక కుటుంబంలో ఉన్న ఓటర్లందరికి ఒకే పోలింగ్ బూత్ లో ఓటు వేసే అవకాశం వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ వి ఆర్ వో ల పర్యవేక్షణలో ప్రతిబిఎల్ఓ ప్రతి వీధిలో ఉన్న డోర్ నంబర్లలో ఉన్న ప్రజలను పూర్తిగా సర్వే చేసి వారికి ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఒకే చోట ఉన్నాయా లేదా వంటి విషయాలపై నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏ ఈ ఆర్ వో బిఎల్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు నరహరిశెట్టి నరసింహారావు (INC), ఎన్ వీరభద్రరావు (CPI), ఎం బాబురావు (CPI (M)), తరుణ్ కాకాని (BJP), ఎన్ సాంబశివరావు (TDP), G సుందర్ పాల్ (YSRCP), ఏ ఈ ఆర్ ఓ లు చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ కే. ప్రభుదాస్, పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్యకుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, సెంట్రల్ తహసిల్దార్ ఎం వెంకటరామయ్య, నార్త్ సాహసిల్దార్ శ్రీమతి ఎమ్ సూర్యరావు, సెంట్రల్ డిప్యూటీ తహసీల్దార్ టీ. సురేష్ కుమార్, పాల్గొన్నారు.