8-8-2025
నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కరెంటు ఉచితం కృతజ్ఞతలు తెలియజేసిన నాయి బ్రాహ్మణ సంఘం
ధి:-8-8-2025 శుక్రవారం ఈరోజు సాయంత్రం 5:30″గం లకు ” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తూ దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.25 వేలకు పెంపు, సెలూన్ లకు G.O నంబర్ 15 ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను, ప్రతి దేవాలయాల్లో ఒక నాయి బ్రాహ్మణుడికి బోర్డు మెంబర్ గా అవకాశం కలిపించి ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది…
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రమటానికి పాలాభిషేకం నిర్వహించి బీసీలకు నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి నా ఈ బ్రాహ్మణులు కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:-టిడిపి ప్రభుత్వం ఎప్పుడూ బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. గతంలోనూ టిడిపి పాలనలో కుల వృత్తుల దారులకు పనిముట్లు, సబ్సిడీ రుణాలు అందించామని, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బీసీలు వెనుకబడ్డారని అని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టిన తర్వాత, బీసీ కులాల అభివృద్ధి కోసం అనేక చర్యలు ప్రారంభించిందని
చేనేత కుటుంబాల్లో మగ్గాలు ఉన్నవారికి 500, లేనివారికి 200, అలాగే నాయి బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నట్లు, వెనుకబడిన కులాల ఆత్మస్థైర్యం పెంచేందుకు NDA ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బోండా ఉమా తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ ప్రెజెంట్ సత్యనారాయణ, సెక్రటరీ అయినపర్తి శీను, పేకేటి శ్రీనివాస్, గోనుగుంట్ల యలమందరావు, ఉప్పూడి రాము, మోహన్, కొమ్మాజి సంజీవ్, పేకేటి సింహాచలం, దొడ్డి చింతల రాజేష్, మార్కెల్ నాగరాజు, గండికోట శ్రీనివాసరావు, పెద్దపూడి పవన్, కృష్ణ, పండూరి సాయి, సంతోష్, వేపాడ రమణ, పెద్దపల్లి దుర్గాప్రసాద్, సెంట్రల్ వాణిజ్యవిబాగ కార్యదర్శి గుండ్లపాక శ్రీకాంత్, గోల్కొండ శివ తదితరులు పాల్గొన్నారు