నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు.అధికారులతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమీక్ష

Spread the love

నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు.

మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టం అంచనా వేయండి.

అధికారులతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమీక్ష.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, అక్టోబర్ 30:

రైతులెవరూ అధైర్య పడవద్దని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.

మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మైలవరం నియోజకవర్గంలో తుఫాను కారణంగా సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గురువారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంగా వరిపైరు చేతికి వచ్చే దశలో ఈ విధంగా నీటమునగటం చాలా బాధాకరం అన్నారు. అలాగే పత్తి కూడా వరుసగా వర్షాల నేపథ్యంలో రైతులకు చేతికి అందకుండా పోతోందన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, వాణిజ్య పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయన్నారు. దీనిపై ఖచ్చితంగా ఎన్యుమరేట్ చేసి నష్టం జాబితాలను ప్రభుత్వానికి నివేదించాలన్నారు.

సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారని అన్నారు. కౌలు రైతులకు కూడా వారికే నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అలానే వరి, పత్తి పైర్లలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. రైతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పంట నష్టం తీవ్రత తగ్గించాలని ఆదేశించారు.

Loading