న‌గ‌రాభివృద్దిని అడ్డుకోవాల‌ని చూస్తే జాగ్ర‌త్త‌! వైసిపి కార్పొరేట‌ర్లు ట‌చ్ లోనే వున్నారు : టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల

1
0

25-06-2025

న‌గ‌రాభివృద్దిని అడ్డుకోవాల‌ని చూస్తే జాగ్ర‌త్త‌! వైసిపి కార్పొరేట‌ర్లు ట‌చ్ లోనే వున్నారు : టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల

మున్సిపల్ కౌన్సిల్లో పాలకవర్గం వైసీపీ తీరును ఖండించిన ఎన్డీయే కూట‌మి కార్పొరేట‌ర్లు
మంగ‌ళ‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ కౌన్సిల్ ను చీక‌టి రోజుగా ప్ర‌క‌ట‌న‌
త్వ‌ర‌లో గుణ‌పాఠం చెబుతామ‌ని హెచ్చ‌రిక‌

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దిని అడ్డుకోవాల‌నే దుర్దుద్దేశ్యంతో, సంఖ్య బ‌లం వుంద‌న్న అహంకారంతో మంగ‌ళ‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ కౌన్సిల్ లో వైసిపి పాల‌క ప‌క్షం వీర్రవిగింది. టేబుల్ ఎజెండా ( 88కె) ద్వారా ప్ర‌వేశ పెట్టిన ప్ర‌జాభివృద్ది, న‌గరాభివృద్ది తీర్మానాల‌ను దురుద్దేశ్యంతో తిర‌స్క‌రించింది.
మున్సిప‌ల్ కౌన్సిల్ లో సంఖ్య బ‌లం వుంద‌ని వైసిపి పాల‌క‌ప‌క్షం ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేస్తే….91 కె కింద ఎన్డీయే కూట‌మి కార్పొరేట‌ర్లు త్వ‌ర‌లోనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవ‌కాశం త్వ‌ర‌లోనే వుంది…వైసిపి కార్పొరేట‌ర్లు ట‌చ్ లో వున్నారంటూ టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల వైసిపి పాల‌క ప‌క్షాన్ని హెచ్చ‌రించారు.

మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ న‌గ‌రపాల‌క సంస్థ‌లో జ‌రిగిన మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో అమ‌రావ‌తి అభివృద్ధితో పాటు విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ది జ‌ర‌గాల‌న్న ఆలోచ‌న‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం సూచ‌న‌లు మేర‌కు టేబుల్ ఎజెండా ద్వారా ప్రవేశ‌పెట్టిన తీర్మానాల‌ను వైసిపి పాల‌క‌ప‌క్షం తిర‌స్క‌రించ‌టాన్ని ఖండిస్తూ టిడిపి, ఎన్డీయే కూట‌మి కార్పొరేట‌ర్లు బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు..

ఈ స‌మావేశంలో టిడిపి ఫ్లోర్ లీడ‌ర్ నెలిబండ్ల బాల మాట్లాడుతూ త్వ‌ర‌లో వైసిసి పాల‌క ప‌క్షానికి గుణ‌పాఠం చెబుతామ‌ని హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన కౌన్సిల్ స‌మావేశాన్ని చీక‌టి రోజుగా అభివ‌ర్ణించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ సూచ‌న‌లు మేర‌కు కార్పొరేష‌న్ అధికారులు 88 కె కింద పెట్టిన‌ ప్ర‌తిపాద‌న‌లన్నీ తిర‌స్క‌రించ‌టాన్ని ఎన్డీయే కార్పొరేట‌ర్లు తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు.
స‌గ‌రాల క‌మిటీ కళ్యాణ మండ‌పం క‌మ్యూనిటీ హాల్ ప్ర‌తిపాద‌న, న‌గ‌ర‌వాసుల‌కు తాగు నీరు అందించే ప్ర‌తిపాద‌న, ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో ఫుడ్ కోర్ట్ పెట్టాల‌నే ప్ర‌తిపాద‌న తిర‌స్క‌రించ‌టం వాళ్ల దుర్మార్గ ఆలోచ‌న‌ల‌కు నిద‌ర్శ‌నం అంటూ మండిప‌డ్డారు. 3,58,000 నీటి క‌నెక్ష‌న్లు వుంటే 3 ల‌క్ష‌ల 7 వేల‌కి నీటి క‌నెక్ష‌న్లు ఇవ్వ‌గా, . మిగిలిన‌ 50 వేల ఇళ్ల‌కు …తాగునీరు అందించేందుకు నీటి క‌నెక్ష‌న్ ఇద్దామ‌ని డిపిఆర్ లు త‌యారు చేస్తే వాటిని తిర‌స్క‌రించి ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత తాగునీరు తాగే హ‌క్కు లేద‌నే విధంగా అవ‌మానించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నగరం లో 19 ప్రధానమైన రోడ్ లను పి పి పి విధానం లో ఇవ్వ‌టానికి రూ.2 కోట్ల 77 ల‌క్ష‌ల‌కు డిపిఆర్ పెడితే ఏ కార‌ణం చెప్ప‌కుండా తిర‌స్క‌రించ‌టం వైసిపి పాల‌క ప‌క్షం అహంకారానికి నిలువెత్తు నిద‌ర్శ‌నమ‌న్నారు.

జ‌గ‌న్ ఏ విధంగా గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్రాన్ని ఏ విధంగా నాశ‌నం చేశాడో , అదే విధంగా విజ‌య‌వాడ న‌గ‌రాన్ని అభివృద్దికి దూరంగా చేయ‌టానికి విజ‌య‌వాడ కార్పొరేష‌న్ లో పాల‌క ప‌క్షం ముందుకువెళుతుంద‌న్నారు. అమ‌రావ‌తితో పాటు విజ‌య‌వాడ‌ను అభివృద్ది చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుంది. విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్దిని అడ్డుకోవాల‌నే దుర‌ద్దేశ్యంతో వైసిపి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును కౌన్సిల్ అడ్డుకోవ‌ట‌మే కాదు. వ్య‌తిరేకించాము..త్వ‌ర‌లోనే వారికి త‌గిన బుద్ది చెబుతామ‌ని హెచ్చ‌రించారు.

కార్పొరేట‌ర్లు ముమ్మ‌నేని ప్ర‌సాద్, జాస్తి సాంబ‌శివ‌రావు, దేవిఅప‌ర్ణ మాట్లాడుతూ ప్ర‌జాస‌మస్య‌ల‌ను తిర‌స్క‌రించ‌టమ‌నేది వైసిపి పాల‌కప‌క్షం అవివేకానికి నిద‌ర్శ‌మ‌న్నారు. జ‌మైకా అపార్ట‌మెంట్స్ వుంటున్న 480 కుటుంబాల‌కు మంచినీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఎమ్మెల్యేలు, ఎంపీల స‌హ‌కారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను కూడా తుంగ‌లో తొక్కార‌న్నారు. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో ఫుడ్ తీర్మానం తిర‌స్క‌రించ‌టం వ‌ల్ల కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసే కోటి రూపాయ‌ల నిధులు ఆగిపోవ‌టం జరిగింద‌న్నారు.

సుమారు పది నెలల పాటు కార్పొరేషన్ ఉద్యోగానికి రావటం లేదని కౌన్సిల్ లో కంప్లైంట్ పెడితే వైసీపీ లంచాలు తీసుకోని అతన్ని మళ్ళీ ఉద్యోగం లోకి తీసుకుంటాం అంటూ తీర్మానం చేయటం అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధమౌతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధుల‌తో న‌గ‌రాభివృద్ది కోసం ఎంపీ కేశినేని శివ‌నాథ్ అండ‌ర్ గ్రౌండ్ కోసం, వాట‌ర్ స‌ప్లై కోసం తీర్మానాలు, స్ట్రామ్ వాట‌ర్ కోసం ఒక డిపిఆర్ త‌యారు చేయిస్తే వాటిని తిర‌స్క‌రించారు. శానిట‌రీ ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన 96 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ‌గ‌ల స‌బ్బులు,బ‌ట్ట‌లు ఇత‌ర వ‌స్తువులపై తీర్మానం పెడితే తిర‌స్కరించ‌టం జ‌రిగింద‌న్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు చేయాల‌నుకున్న అభివృద్ధి ప‌నుల‌కు ఎందుకు అడ్డుప‌డాల‌నుకుంటున్నారో స‌మాధానం చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. అభివృద్దిని ఎందుకు కాదంటున్నారో ప్ర‌జ‌ల‌కు కూడా స‌మాధానం చెప్పాల్సిన అవ‌సరం వుంద‌న్నారు.రాబోయే కాలంలో విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లో ఒక సీటు కూడా గెలిచే ప‌రిస్థితి వుండ‌ద‌న్నారు. వైసిపి పాల‌క్ష ప‌క్షం అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి చేసిన తీర్మానాల‌పై ఒక ఎంక్వైయిరీ క‌మిటీ వేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు ,చెన్నుపాటి ఉషారాణి, కంచి దుర్గ, వ‌ల్ల‌భ‌నేని రాజేశ్వ‌రి, మైల‌వ‌ర‌పు ర‌త్న‌కుమారి, మ‌హ‌దేవా అప్పాజీ, చ‌న్న‌గిరి రామ్మోహ‌న్, ఉమ్మ‌డి శెట్టి బ‌హుదూర్, అత్తూలురి జ‌య‌ల‌క్ష్మీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here