Home Political news నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకలు

నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతి వేడుకలు

2
0

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :

ది.08-07-2024(సోమవారం) 

నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి  75 వ జయంతి వేడుకలు

*అంబారుపేట, పల్లగిరి, ముక్కపాటి కాలనీ*- పలు గ్రామాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి  విగ్రహాలకు, చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ 

*పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ లు కట్ చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్*

తెలుగు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న మహనీయుడు YS రాజశేఖర్ రెడ్డి. పేద ప్రజలు దైవంలా కొలిచే గొప్ప నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 

*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన అంటేనే స్వర్ణయుగం గా చరిత్ర పుటల్లో నిలిచింది… పేదవారి కోసం “ఇందిరమ్మ ఇళ్ల” పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి సొంత ఇంటి కలను నిజం చేసిన మహా నేత YSR : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్*

తెలుగు నేల ను సస్యశ్యామలం చేసేందుకు జల యజ్ఞాన్ని తలపెట్టి… వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి… ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు …

*ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు ‌…*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here