దేశ హితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

5
0

 భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ 

దేశ హితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ

విజయవాడ… దేశ స్వాతంత్య్రం కోసం ఎంతో మంది బలిదానం చేస్తే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ హితం కోసం బలిదానం చేసిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని ఆయన జీవిత విశేషాలు వివరించారు బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ వివరించారు.

బిజెపి రాష్ట్ర కార్యాలయం లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీ బలిదాన దినోత్సవం నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ముఖ్య వక్తగా మధుకర్ జీ పాల్గొన్నారు.

ఈసందర్భంగా మధుకర్ జీ ప్రసంగిస్తూ 33సంవత్సరాల వయస్సు లో బెంగాల్ యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్ అయ్యారు. అధ్బుతమైన మేధావి.

ఆయన నివాసం లో 75వేల పుస్తకాలు ఉన్నాయి అంటే ఆయన ఎంతటి జ్ఞానో మనకి అర్థం అవుతుంది.

ఆనాడు కేంద్ర మంత్రి గా ఉన్నప్పటికీ కాశ్మీర్ గురించి గళం విప్పారు.కాశ్మీర్ లో జాతీయ జెండా ఎగరాలన్నారు.ఆనాడు దేశం లో మూడు సంస్థానాలు విలీనం కాలేదు ఈ విషయం లో ఖచ్చితమైన అభిప్రాయం తో దేశం హితం కోసం పోరాటం చేశారు.ఆయన విద్యా మంత్రి గా సేవలు అందించాలని అనుకుంటే ఆనాటి ప్రధాని నెహ్రూ అవకాశం ఇవ్వలేదు.

అంటూ ఆయన జీవిత చరిత్ర ను సోదాహారణంగా వివరించారు.

ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా బిజెపి కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయి శ్రీనివాస్ బిజేపి సీనియర్ నేత సురేష్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, శ్రీ ధర్,కిలారు దిలీప్, నరసరాజు, రత్నకుమారి బిజెపి నేతలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here