దేదీప్యమానంగా కలశ జ్యోతి ఊరేగింపు
43 వసంతాల కలశ జ్యోతి ఊరేగింపు
తేది. 14.12.2024:
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా
భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ… అని లలితా సహస్ర నామములో కీర్తించిన రీతిగా భవుడైన శివుని సతీమణి భవానీ.
ఆ భవానీని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ చేసే దీక్షే భవానీ దీక్ష.
ఇంద్రకీలాద్రి పై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమబద్ధ దీక్షతో పూజించి, అమ్మ అనుగ్రహం పొందటానికి గానూ కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు, కలశ జ్యోతి ఊరేగింపు ప్రారంభం అయింది.
ఆనవాయితి ప్రకారం సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి సాయంత్రం 6 గంటలకు దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన రధం పై అధిరోహించగా, ఆలయ కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామరావు, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
కోలాటాలు,నృత్యాలు వంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనల మధ్య
వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సామెతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలశ జ్యోతులను చేత పట్టుకొని జై జై దుర్గా నామ స్మరణతో ముందుకు సాగారు.