దుర్గమ్మ సన్నిధిలో కేంద్రబృందం
ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఈరోజు సాయంత్రం కేంద్ర గిరిజన వ్యవహారముల శాఖ- Ministry of Tribal Affairs- (MOTA )అధికారుల బృందం దర్శించుకున్నారు.
మనీష్ ఠాకూర్ -కేంద్ర అదనపు కార్యదర్శి సారధ్యంలో కేంద్ర అధికారులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. ఎం. నాయక్ దేవస్థానం నకు తోడ్కోని వచ్చారు.
కేంద్రబృందాన్ని ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్ స్వాగతించి, శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండిత ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.