విజయవాడ, తేదీ: 05.08.2025
దిగ్విజయంగా 2025 హజ్ యాత్ర పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు
– షేక్ హసన్ భాషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్
2026 హజ్ యాత్ర కోసం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునఃకేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ముస్లిం సమాజం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా తెలియజేశారు. సోమవారం వెలగపూడి సచివాలయం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా మరియు సభ్యులు కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు. ఆ విజ్ఞాపన పత్రంలో తెలియజేసిన అంశాలు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం విడుదల చేయవలసిందిగా కోరుచున్నామన్నారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ఎంచుకున్న తరువాత హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుండి హజ్ యాత్రకు వెళ్లిన 72 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి రూ. 1,00,000 ల ఆర్థిక సహాయం మంజూరు చేసి విడుదల చేయవలసిందిగా కోరుచున్నమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మరింత మంది హజ్ యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ ను ఎంచుకునేలా ప్రోత్సహించడంలో సహాయ పడుతుందన్నారు.
ముఖ్యమంత్రి సహకారంతో 2025 హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ముస్లిం సమాజం కృతఙ్ఞతలు తెలిజేస్తుందన్నారు. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుండి మొత్తం 1,618 హజ్ యాత్రికులు వెళ్లగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన విస్తృత ఏర్పాట్లతో వారి యాత్ర ఆధ్యాత్మికంగా, సంతృప్తికరంగా సాగిందన్నారు. విజయవాడ లేదా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన 5 నుండి 6 ఎకరాల స్థలాన్ని శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోసం CRDA ద్వారా కేటాయించవలసిందిగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా తెలియజేశారు..