దసరా శరన్నవరాత్రుల రెండో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక చింతన
.. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తకోటి చేసిన జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. శ్రీ గాయత్రీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో క్యూ లైన్లన్నీ సాఫీగా ముందుకు సాగగా అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోంది. సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం లభించడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ డా. సృజన, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మార్గనిర్దేశంతో సెక్టార్ల వారీగా ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవలందిస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు కూడా భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.* (ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ నుంచి జారీ)