ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్.టి.ఆర్.జిల్లా తేది.29.09.2025
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్
మూలా నక్షత్రం సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను వివరించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎనిమిదవ రోజు ఆశ్వీజ సుద్ద సప్తమి సోమవరం శ్రీ సరస్వతి దేవి అలంకృత అమ్మవారిని రాష్ట్ర డి.జి.పి.హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. దర్శనం చేసుకోవడం జరిగింది.ఈ క్రమంలో మూలా నక్షత్రం సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్త్ ఏర్పాట్లను పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాల ద్వారా బందోబస్త్ ఏర్పాట్లను గురించి, కొత్తగా ఏ.ఐ.ఆధారిత కెమెరాల ఏర్పాటు గురించి, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యల గురించి, హోల్డింగ్ ఏరియాల గురించి, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్ల గురించి పోలీస్ కమీషనర్ రాష్ట్ర డి.జి.పి.హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ కి వివరించడం జరిగింది.బందోబస్త్ ఏర్పాట్లపై డి.జి.పి. సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బందోబస్త్ విధులు నిర్వహించే విధంగా చేయాలని సూచనలు చేశారు. దసరా మరియు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు.
![]()
