దసరా శరన్నవరాత్రి మహోత్సవాల బంధోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.

Spread the love

ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్.టి.ఆర్.జిల్లా *తేది.25.09.2025

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల బంధోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.

కమాండ్ కంట్రోల్ నుండి సి.సి.కెమెరాల ద్వారా బందోబస్త్ ఏర్పాట్లను వివరించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ధర్శనంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయడమే లక్ష్యంగా చేసుకుని నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. ఆధునికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ను పరిశీలించడం జరిగింది.

ఈ నేపథ్యంలో దసరా మరియు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలకు సంబంధించిన బందోబస్త్ ఏర్పాట్లపై పోలీస్ కమాండ్ కంట్రోల్ నుండి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాల ద్వారా బందోబస్త్ ఏర్పాట్లను గురించి, కొత్తగా ఏ.ఐ.ఆధారిత కెమెరాల ఏర్పాటు గురించి, రద్దీ పెరిగిన సమయంలో తీసుకునే చర్యల గురించి, హోల్డింగ్ ఏరియాల గురించి, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్ల గురించి పోలీస్ కమీషనర్ రాష్ట్ర డి.జి.పి. హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్.కి వివరించడం జరిగింది.

బందోబస్త్ ఏర్పాట్లపై డి.జి.పి. సంతోషం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎక్కడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ బందోబస్త్ విధులు నిర్వహించే విధంగా చేయాలని సూచనలు చేశారు. దసరా మరియు విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *