Home Andhra Pradesh దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా ఉండాలి దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా ఉండాలి దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

6
0

ఇంద్రకీలాద్రి, 07 జూలై 2025

దసరా ఉత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా ఉండాలి

  • దేవదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
    సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 02 వరకు ఇంద్రకీలాద్రి పై జరిగే దసరా ఉత్సవాలుకు సంబందించిన ఏర్పాట్లు ప్రణాళిక బద్దంగా ఉండి, భక్తులకు సులభంగా, వేగంగా దుర్గమ్మ దర్శనం అయ్యేలా ఉండాలని దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అన్నారు.
    గురు వారం సాయంత్రం ఇంద్రకీలాద్రి మహా మంటపం ఈవో కార్యాలయంలో జరిగిన సమావేశం లో కమిషనర్ మాట్లాడారు.
    వైదిక క్రతువులు సాంప్రదాయబద్ధంగా సరైన సమయాలకు జరుగాలని, పూజా కైంకర్యములు, పరోక్ష సేవలు నిమిత్తం తగు ప్రణాళిక ఉండాలని ఆదేశించారు.
    లడ్డు పోటు, అన్న ప్రసాదం నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని, భక్తుల రవాణా, క్యూలైన్లు ఏర్పాటు, త్రాగు నీరు, అన్న ప్రసాదం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని పేర్కొన్నారు.
    దసరా ఉత్సవాలు 11 రోజులు నిమిత్తం అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటునట్టు ఈవో శీనానాయక్ దేవదాయ కమిషనర్ కు వివరించారు.
    ఈ సమావేశంలో దసరా ఉత్సవ ప్రధాన అధికారి డి. భ్రమరాంబ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here