దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ
టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు భారత హెూం మంత్రిత్వశాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న దలైలామా నివాసం వద్ద భద్రతా ఉంటుంది. చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి భారత్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. భౌగోళిక రాజకీయాల ఉద్రికత్తల అంశాన్ని దృష్టి పెట్టుకున్న భారత ప్రభుత్వం ఆయనకు జెడ్ ప్లస్ భద్రతను ఏర్పాటు చేసింది.