త్రాగునీటి సమస్యని 24 గంటల్లో పరిష్కరించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ 

13-08-2024

 త్రాగునీటి సమస్యని  24 గంటల్లో పరిష్కరించాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు

 కండ్రిక శివారు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను 24 గంటలు పరిష్కరించాలని విజయవాడ నగరపాలక సంస్థ ధ్యానచంద్ర 

 మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 64వ డివిజన్ పాతపాడు, కండ్రిక, ప్రకాష్ నగర్ పర్యటించి అధికారులను ఆదేశించారు.

 శివారు ప్రాంతంలో పర్యటించి రోడ్డు సైడ్ మార్జిన్ లో మొక్కలు పెరిగిపోవటం గమనించి, పారిశుద్ధ కార్మికులు సక్రమంగా  పారిశుద్ధ్య నిర్వహణ చేయాలన్నారు. కండ్రికలో త్రాగునీటి సమస్య లేకుండా, దానికి కావాల్సిన తగు చర్యలు తీసుకొని  24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి నూజివీడు రోడ్డులోని 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా చేపట్టిన వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ పనులను పరిశీలించారు. తదుపరి ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో  స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జరుగుతున్న పనులను పరిశీలించారు. మంచినీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు పరిశీలించి ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

 ఈ పర్యటనలలో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *