తొలి అడుగు” తో ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్న -MLA బొండా ఉమ

1
0

3-7-2025

స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించి “సుపరిపాలనలో – తొలి అడుగు” తో ప్రజల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్న -MLA బొండా ఉమ

NDA కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించిన -MLA బొండా ఉమ

ధి:3-7-2025 గురువారం సాయంత్రం NDA కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “సుపరిపాలనలో – తొలి అడుగు” కార్యక్రమము 64వ డివిజన్ కండ్రిక డివిజన్ ట్రాన్స్ఫారం రోడ్డు నుండి సుబ్బారెడ్డి స్కూల్ బూత్ నెంబర్ 102, 103,104,106 నందు మరియు 61వ డివిజన్ ప్రకాష్ నగర్ సెంటర్ కనకదుర్గమ్మ తల్లి గుడి సందులో 91వ బూత్  నందు ప్రజల ఇంటింటికి తెలుగుదేశం అవగాహన సదస్సు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు స్థానిక నేతలతో కలిసి పాల్గొని ఇంటింటికీ వెళ్లి NDA కూటమి ప్రభుత్వ ఏడాది పరిపాలన గురించి ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగినది

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- నియోజకవర్గంలోని 21 డివిజన్లలో 267 పోలింగ్ బూత్‌ల పరిధిలో సుమారు 2.80 లక్షల ఓటర్లను కలుసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతామని

నియోజకవర్గం లోని ప్రజలు తమ పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని, ప్రజల ఆశల మేరకే తాము పని చేస్తున్నాం అని,  అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లను రూ.4000గా అందించామని, తల్లికి వందనం పథకంలో ప్రతి బిడ్డకు రూ.13,000 తల్లి ఖాతాలో జమ చేశామని

అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామని, రాబోయే కాలంలో స్త్రీనిధి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలులోకి తెస్తామని, స్థానికంగా విద్యుత్ బిల్లులపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు

ఒకే సంవత్సరంలో రూ.240 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలకు పథకాలు నిలిపివేసిన ఘటనలు ఉన్నాయని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కారం లేదని, ప్రజల శ్రేయస్సే తమ ప్రభుత్వానికి లక్ష్యం అని  బొండా ఉమా తెలియజేసారు

ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు,64వ డివిజన్ కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి Sk బాబు, పలగాని భాగ్యలక్ష్మి, రాజేష్, కంకణాల బాబు, భవాని, శ్యామల, చిట్టిబాబు, అధ్యక్షుడు  61వ డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్, ఇంచార్జ్ దాసరి దుర్గారావు, క్లస్టర్ ఇంచార్జ్ దాసరి కనకారావు, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అమ్మారావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, బూత్ కన్వీనర్ చింతల దుర్గాప్రసాద్, అన్నా బత్తుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here