తెలుగు పత్రికా రంగ మేరునగధీరుడు, తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే చెరుకూరి రామోజీరావు మహాభినిష్ర్కమణానికి నా శ్రద్ధాంజలి. తెలుగువారికి

4
0

తెలుగు పత్రికా రంగ మేరునగధీరుడు, తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే  చెరుకూరి రామోజీరావు  మహాభినిష్ర్కమణానికి నా శ్రద్ధాంజలి. తెలుగువారికి

రామోజీ రావుగారు చేసిన సేవలు చిరస్మరణీయం. పత్రికా రంగంలో విలువలు పాటిస్తూ, పాలకుల అవినీతిని, నిరంకుశత్వాన్ని ఎండగడుతూ, తెలుగు భాషాభివృద్ధికి పాటు పడుతూ, తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఒక్క పత్రికా రంగంలోనే కాదు.. ఎలక్ట్రానిక్ మీడియాలో, సినిమా రంగంలో, సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీరావు  సదా స్మరణీయులు. జర్నలిజానికి, రెండు తెలుగు రాష్ట్రాలకు వారు లేని లోటు తీర్చలేనిది. వారి మరణం వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి జీర్ణించుకోలేని విషాదం. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 

యలమంచిలి సత్యనారాయణ చౌదరి సుజనా చౌదరి

విజయవాడ  పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here