తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ ఆవిష్కరించి కౌంటర్లను ఏర్పాటు చేసి ముందుగా బోండా రవితేజ వారి ఓటును నమోదు రిజిస్ట్రేషన్ పత్రాలను స్వయంగా

3
0

 

8-10-2024

ధి:8-10-2024 మంగళవారం సాయంత్రం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు త్వరలో జరగనున్న కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహ కార్యక్రమాలలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చిన గ్రాడ్ వెడ్స్ ఓట్ల నమోదు పత్రాలను తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ  ఆవిష్కరించి కౌంటర్లను ఏర్పాటు చేసి ముందుగా బోండా రవితేజ  వారి ఓటును నమోదు రిజిస్ట్రేషన్ పత్రాలను స్వయంగా పూర్తి చేయడం జరిగినది

ఈ సందర్భంగా బోండా రవితేజ  మాట్లాడుతూ:-గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికలు అంటే,ఉన్నత విద్యార్హతలు కలిగిన వ్యక్తులు, అనగా పట్టభద్రులు తమ ప్రతినిధిని ఎన్నుకునే ఒక ప్రత్యేకమైన ఎన్నికల ప్రక్రియ అని.

ఈ ఎన్నికల ద్వారా ఎన్నికైన వ్యక్తి, తన నియోజకవర్గం వారి అభిప్రాయాలను శాసనసభ లేదా శాసన మండలిలో ప్రతిబింబించే బాధ్యత వహిస్తారు అని..

ఏదైనా ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన వ్యక్తులు ఈ ఎన్నికలలో ఓటు వేయవచ్చు అని

పోయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నిలిపింది అని, ఎన్నికల జరిగిన 3 గ్రాడ్యుయేట్స్ స్థానాలు టీడీపీ ఖాతాలోకే రావడంతో పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు అని.

నవ సమాజానికి పునాదిగా ఉమ్మడి గుంటూరు ,కృష్ణ జిల్లాల పట్టభద్రులు (గ్రాడ్యుయేట్లు) త్వరగా తమ ఓటును హాఫ్/ఆన్లైన్ లో నమోదు చేయించుకుని కూటమి ప్రభుత్వం బలపరిచిన వారిని అఖండ మెజారిటీతో గెలిపించ వలసినదిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర  తరపున కోరడం జరిగినది…

ఈ కార్యక్రమంలో:-మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, బెజవాడ తిరుపతి, కొడాలి వంశీ, బలుసు పాటి మహేష్, తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here