తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న‌ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ బూత్ క‌న్వీన‌ర్ల, క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జుల ప్ర‌మాణ స్వీకారం

Spread the love

11-11-2025

తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం : మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న‌
ప‌శ్చిమ నియోజ‌క‌వర్గ బూత్ క‌న్వీన‌ర్ల, క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జుల ప్ర‌మాణ స్వీకారం
భారీ ఎత్తున న‌గ‌రాల క‌ళ్యాణ మండ‌పంలో కార్య‌క్ర‌మం
ముఖ్యఅతిథిగా పాల్గొన్న దూదేకుల సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా

విజ‌య‌వాడ : క్ర‌మ‌శిక్ష‌ణ, నిబద్ధ‌త‌, నిజాయితీ గ‌ల తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేర‌కు ఆమోదించ‌బ‌డిన బూత్ క‌న్వీన‌ర్ల, క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జుల ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో చిట్టిన‌గ‌ర్ న‌గ‌రాల క‌ళ్యాణ మండ‌పంలో మంగ‌ళ‌వారం పెద్ద ఎత్తున జ‌రిగింది.

ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్ధా వెంక‌న్న స‌భాధ్యక్ష‌త వ‌హించగా, దూదేకుల సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బూత్ క‌న్వీన‌ర్ల, క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జులతో బుద్ధా వెంక‌న్న ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఈ సంద‌ర్భంగా బుద్ధా వెంక‌న్న మాట్లాడుతూ ప‌శ్చిమ నియోజ‌క‌వర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్య‌క‌ర్తలంద‌రీ అభిప్రాయం సేక‌రించిన త‌ర్వాతే బూత్ క‌న్వీన‌ర్ల, క్ల‌స్ట‌ర్,యూనిట్ ఇన్చార్జులుగా నియ‌మించ‌టం జ‌రిగింద‌న్నారు. ప్ర‌మాణ స్వీకారం చేసిన నాయ‌కులంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేటంతోపాటు, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల నిర్ణ‌యాలు, అభిప్రాయాల‌తోనే బ‌ల‌ప‌డుతుంద‌న్నారు. కార్య‌క‌ర్త‌ల ఆధ్వ‌ర్యంలోనే పార్టీ ముందుకు నడుస్తుంద‌ని స్ప‌ష్టం చేవారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆదేశాల మేర‌కు అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఐక్యంగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు.

అనంత‌రం నూర్ బాషా\దూదేకుల సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా మాట్లాడుతూ ప‌శ్చిమ నియోజ‌క‌వర్గంలో టిడిపి అధికారంలో వున్నా, లేక‌పోయినా ప్ర‌తి కార్య‌క‌ర్త ఒక‌ సైనికుడిలా పార్టీ కోసం పనిచేశార‌ని కొనియాడారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం టిడిపికి కంచుకోట లాంటిద‌న్నారు. ఎంపీ గా కేశినేని శివ‌నాథ్ గెలిచిన త‌ర్వాత ఈ ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాల్లో చాలా వ‌ర‌కు పార్టీని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకువెళ్లేందుకు కార్య‌క‌ర్త‌లు చాలా బాగా కృషి చేశారంటూ వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు చిట్టాబ‌త్తుని శ్రీనివాస‌రావు, టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి ఎమ్.ఎస్.బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్య‌క్షుడు సొలంకి రాజు, టిడిపి ద‌ళిత సీనియ‌ర్ నాయ‌కులు కామ దేవ‌రాజు, విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌ద‌ర్శి కొట్టెటి హ‌నుమంతురావు, కార్పొరేట‌ర్ ఉమ్మ‌డి చంటి,న‌గ‌రాల కార్పొరేష‌న్ స్టేట్ డైరెక్ట‌ర్ సుఖాసి కిర‌ణ్ , ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ అధ్య‌క్షుడు న‌మ్మిభాను ప్ర‌కాష్, గొల్ల‌పూడి వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మ‌న్ పాల మాధ‌వ , ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, ల‌తో పాటు క్ల‌స్ట‌ర్ ,యూనిట్ , బూత్ క‌మిటీల స‌భ్యులు, తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు.

Loading