తెలిసి తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్ లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు,నింపేందుకు కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.

Spread the love

 శిక్ష కాదు కాదు శిక్షణ తెలియాలి 

ఎమ్మెల్యే సుజనా చౌదరి

తెలిసి తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్ లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు,నింపేందుకు కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.విద్యాధరపురం లోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహాన్ని సుజనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డితో హోమ్ లోని సమస్యలు మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. హోమ్ లోని బాలలతో ముఖా ముఖి మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సంరక్షించేవారు లేక కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా బాలలు పేడత్రోవ పట్టి చిన్న వయసులోనే నేరాలకు పాల్పడటం బాధాకరమన్నారు. హోంలోని బాలల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత సిబ్బంది తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి హోం ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. మంచి నడవడిక కలిగిన బాలలని దత్తత తీసుకునె ఆలోచన చేస్తామన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *