తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మరికొన్నింటిని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలో జీవో ఇవ్వనుంది. పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలు, రూ.10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ తీర్మానం చేసింది.
16 బీసీ కార్పోరేషన్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. హౌసింగ్ కార్పోరేషన్ పునరుద్ధరణకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2008 డీఎస్సీ అభ్యర్థుల ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయించింది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించనుంది. గత ప్రభుత్వం ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ తీర్మానం చేసింది.
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ జరపనుంది. రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు ఇవ్వనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని కమిటీకి సూచన చేయనుంది.
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని […]
Spread the love ఈసారి ఫిబ్రవరి నుంచే ప్రతాపం చూపిస్తున్న భానుడు మార్చిలో మరింతగా చెలరేగుతున్నాడు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సగటు ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటేశాయి. ఈ వారంలోనే 40 డిగ్రీలు […]
Spread the love లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కే […]