తెదేపా సూపర్ సిక్స్ పధకాలతో ఆర్థిక భరోసా

Spread the love


 తెదేపా సూపర్ సిక్స్ పధకాలతో ఆర్థిక భరోసా

టిడిపి, జనసేన, బిజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి

గన్నవరం నియోజకవర్గం జనసేన, బిజెపి పార్టీలు బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు గెలుపును కాంక్షిస్తూ, బాపులపాడు మండలం, పెరికీడు గ్రామంలో గ్రామ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ కరపత్రాల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నవరం నియోజకవర్గం జనసేన, బిజెపి పార్టీలు బలపరచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి శ్రీ యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ మోసకార సంక్షేమం అమలు చేస్తూ అన్ని ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై తీవ్రమైన భారం మోపిన ఘనత వైసీపీకే దక్కుతుందని అన్నారు. ఈ పరిస్థితిలో నిరుపేదలకు మరియు మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు పెరిగిన ధరల భారం నుండి ఉపశమనం కలిగే విధంగా రూపకల్పన చేశారని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ సూపర్ సిక్స్ పథకాలు అందుతాయని భరోసానిచ్చారు.

రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి యార్లగడ్డ వెంకట్రావును, గాజుగ్లాసు గుర్తుకు ఓటువేసి బందరు పార్లమెంటు కూటమి అభ్యర్ధి బాలశౌరిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వేగిరెడ్డి పాపారావు, మూల్పూరి సాయి కళ్యాణి, రాజులపాటి శ్రీనివాసరావు, బేతాళ ప్రమీలారాణి, వడ్డిల్లి లక్ష్మీ, ఆర్నేపల్లి సుబ్బారావు, కొత్తూరు ఆంజనేయులు, మోచర్ల గిరి మరియు టిడిపి, జనసేన, బిజెపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *