తుఫాను సంసిద్ధతపై సమీక్షను నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Spread the love

తుఫాను సంసిద్ధతపై సమీక్షను నిర్వహించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు తెలంగాణలలో మోంతా తుఫాను ప్రభావాన్ని అంచనా వేస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలని రైల్వేలను ఆదేశించిన కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్.
ఈరోజు తుఫాను సంసిద్ధతను సమీక్షించారు.
కీలక చర్యలు:

  • డివిజనల్ వార్ రూమ్‌ల క్రియాశీలత
  • ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం మరియు గుంటూరు డివిజన్లలో అవసరమైన సామాగ్రి, యంత్రాలు మరియు మానవవనరులను సిద్ధం చేయడం.
  • ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రైలు కార్యకలాపాలను పర్యవేక్షించడం.
  • ఈస్ట్ కోస్ట్ , సౌత్ కోస్ట్ మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లు అత్యవసర ప్రతిస్పందన కోసం వనరులను సమీకరించడానికి అవసరమైన జాగ్రత్తలు చేపట్టడం.

Loading