తిరువూరు నియోజకవర్గంలో కాసులు కురిపిస్తున్న రేషన్ అక్రమ దందా వ్యాపారం

Spread the love

 తిరువూరు నియోజకవర్గంలో కాసులు కురిపిస్తున్న రేషన్ అక్రమ దందా వ్యాపారం

పది రోజుల్లోనే భారీగా దొరికిన రేషన్

మొన్న తిరువూరు నిన్న ఏ కొండూరు

ఎన్ని చర్యలు చేపట్టిన యదేచ్ఛగా అక్రమ దందా

పేదలకందాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. 

తిరువూరు నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగ నడుస్తోంది. అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకున్న రేషన్ మాఫియా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. 

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్ని సంస్కరణలు తెచ్చిన.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా ఫలితం లేకుండాపోతోంది. 

సరైన నిఘా లేకపోవడం, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమ దందా దర్జాగా సాగుతోందనేది ఆరోపణలు. 

పట్టణాల్లో, గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించడానికి ఏజెంట్లను నియమించుకొని రూ.15 కి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. .

సేకరించిన రేషన్ బియ్యాన్ని రాత్రి వేళ్లలో అక్రమ రవాణా ఇబ్బందిగా ఉండటం తో తెల్లవారుజామున పోలీసులు నిద్రకు ఉపక్రమించే సమయంలో దర్జాగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. 

తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం వరకు అక్రమ రవాణా కొనసాగుతుందని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగానే చర్చించుకోవడం విశేషం. 

అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకపోవడంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పూలు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. 

. అంతేకాకుండా రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దళారులను, వ్యాపారులను అదుపులోకి తీసుకుని జరిమానాలతోనే సరిపెడుతున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడం లేదు. కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినా ఇట్లే బెయిల్‌పై వచ్చి తిరిగి అదే అక్రమ వ్యాపారాన్ని సాగించడంతో రేషన్‌ బియ్యం అక్రమ దందా ఆగడం లేదని సంబంధిత శాఖ అధికారులు వాపోతున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *