తిరుమల: శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళం తిరుమల: శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళం అందింది. ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి దాత సీకేపీసీ ప్రాపర్టీస్ ఎండీ చిరాగ్ పురుషోత్తం ఈమేరకు విరాళం డీడీని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఎంతో మంది పేద రోగులకు ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్న తితిదే ఔదార్యాన్ని దాత కొనిడాయారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న ఇలాంటి గొప్ప ట్రస్టుకు రూ.కోటి విరాళం అందజేసిన చిరాగ్ పురుషోత్తంను తితిదే ఛైర్మన్ అభినందించారు.