తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ ఎండి శ్రీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.

6
0

 తిరుమల, 2024 ఆగష్టు 30

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

 తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ ఎండి శ్రీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. 

     ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు,  అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు.

      16 ద్విచక్ర వాహనాలలో  15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

        ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ  సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here