*తిరుమల ప్రసాదం విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధం: వైవీ*
తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు.
రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది.
ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం.
చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు.