తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని 08.08.2025 శుక్రవారం నాడు స్థానిక విజయవాడలోని టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు సౌభాగ్యం కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి మల్లికార్జున రావు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ను దేవాలయ ఇన్స్పెక్టర్ లలిత రమాదేవి ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ సివికే ప్రసాద్ దేవాలయ సిబ్బంది రోహిత్ తదితరులతో కలిసి ఈరోజు అనగా 05.08.2025 మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ టిటిడి కళ్యాణ మండపం ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు టీటీడీ దేవాలయాల పర్యవేక్షణ అధికారి మల్లికార్జున రావు బ్యానర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం పండుగ రోజు ఏర్పాటు చేయబడినటువంటి సౌభాగ్యం కార్యక్రమంలో భాగంగా టిటిడి అధీనంలో ఉన్న రాష్ట్రవ్యాప్త 60 దేవాలయాల్లో దర్శనానికి విచ్చేసిన మహిళలకు సౌభాగ్య ప్రతిరూపాలైన పసుపు కుంకుమలు గాజులు కంకణములు పసుపు తాడు అమ్మవారి పుస్తక ప్రసాదం వంటివి అందజేయబడతాయని తెలియజేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి మాట్లాడుతూ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు ఉదయం 7 గంటల నుంచి స్వామివారి వద్ద ఉంచి విశేషార్చన నిర్వహించి, పూజించిన ఈ సౌభాగ్య ద్రవ్యాలను భక్తులకు వితరణ చేస్తామని ప్రతి స్త్రీ మూర్తికి చాలా విలువైన ఈ సౌభాగ్యములను పొంది అమ్మవారి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలను పొందాలని లలితా రమాదేవి ఆకాంక్షించారు.
Home Andhra Pradesh తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని