తిరుపతిలో వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Spread the love

తిరుపతిలో వృద్ధురాలి గొంతు కోసి దారుణ హత్య

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లా:జులై 19

తిరుపతి జిల్లా కేంద్రంలోని రాయల్ నగర్ లో గురువారం సాయంత్రం దారుణం జరిగింది. 

ఇంటిలో చొరబడ్డ అగంత కుడు 67 ఏళ్ల జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ముఖానికి మాస్క్ వేసుకుని ఇంటిలోకి చొరబడిన దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆగంతకుడు ఎందుకు ఈ దారుణానికి ఒడి గట్టాడన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. 

తిరుపతి రాయల్ నగర్ లో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలిం చిన ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు దారుణంపై ఆరా తీశారు.

తిరుపతి రాయల్ నగర్‌ లోని తిలక్ రోడ్డులోని బసవయ్య అండ్ కో యజమాని శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడ్డాడు అగంతకుడు. శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మి, ఆయన భార్య సురక్ష, ఇద్దరు కూతుళ్లు ప్రేరణ, నియాతి, లపై కత్తితో దాడికి పాల్పడి నట్లు గుర్తించారు. 

కాగా వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలిక గొంతుపై కత్తితో దాడి జరిగినట్లు గుర్తించారు. 

దాడి చేసి పారిపోతున్న అగంతకుడు అదే సమ యంలో బయటకు వెళ్లి ఇంటి తిరిగి వచ్చిన శ్రీనివా సరావు భార్య సురక్ష, పెద్ద కూతురు ప్రేరణ పై కూడా దాడికి పాల్పడ్డాడు. 

మెట్లు ఎక్కుతూ ఎదురు వచ్చిన ఇద్దరిపైనా కత్తి దాడికి ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు.. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన హంతకుడు పక్కింటి యువకుడిగా పోలీసులు అనుమానిస్తు న్నారు. 

సిసి ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన యువ కుడిని గుర్తించినట్లు పోలీసు లు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *