10-7-2025
తల్లితండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్ కు పంపించి మంచి ఉన్నత స్థితి లో ఉంచేలా చూడాలి -MLA బొండా ఉమ
పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటుతూ స్కూల్ ప్రాంగణాన్ని హరితంగా తీర్చిదిద్దుతాం
ధి:10-7-2025 గురువారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గం లోని 59వ డివిజన్ MK బేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల,64వ డివిజన్ కండ్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తల్లితండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (Mega PTM 2.0) మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగినది…
ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు హాజరయ్యారు…
ఈ సందర్భంగా బొండా ఉమ విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడుతూ:-ఈరోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నియోజకవర్గం లోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు…
ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ పాఠశాలలలో మెరుగైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని, మెరుగైన విద్య ఆందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, సూచనలను ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధనకు, సౌకర్యాల కల్పనకు విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలు ఉపయోగపడతాయనా
నిర్బంధకరమైన విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉండదని, ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యంగా ఉండేలా పెడుతున్నామని, విద్యార్థులు ఎవరైనా ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకుని తింటామంటే అవకాశం కల్పిస్తామని, పాఠశాలలో కొన్ని సమస్యలను సమావేశాలలో తల్లిదండ్రులు చెప్పారని అయ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడతామని….
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ:- ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలగా తీర్చిదిద్దేందుకు, పేద కుటుంబాలలోని పిల్లలకు సైతం అత్యంత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది, MLA బొండా ఉమామహేశ్వర రావు సారధ్యంలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు మహర్దశ లభిస్తుందని, మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందన్నారు…
ఈ కార్యక్రమాలలో కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు