
తనదైన శైలితో మీడియా రంగంలో చెరగని ముద్ర వేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించిన అలుపెరుగని అక్షర యోధులు పద్మ విభూషణ్ చెరుకూరి రామోజీరావు జయంతి సందర్భంగా వారికి ఇవే ఘన నివాళులు……
ప్రజా సమస్యలే ఏజెండాగా….
రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా…..
గత నాలుగు దశాబ్దాలుగా సామాజిక సమస్యలు, అవినీతి నిర్మూలన, అభలలపై వేధింపుల నిరోధానికి అక్షరాలే ఆయుధాలుగా మార్చుకుని మీడియా ద్వారా పోరాటం చేస్తూ…..
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటూ…
నైతిక, మానవీయ, సామాజిక విలువలతో వ్యాపార రంగంలోనూ రాణించి రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు రామోజీరావు . ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుదాం…..
గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఐదు ఆరు రోజులకు ఎన్నికల సర్వే చేస్తూ నా విజయానికి కృషి చేసిన ఆ మహానుభావునికి ఇవే నా నమస్సుమాంజలులు….
![]()
