Home Andhra Pradesh తక్షణమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలిహనుమాన్ జంక్షన్

తక్షణమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలిహనుమాన్ జంక్షన్

4
0

తక్షణమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలి
హనుమాన్ జంక్షన్ :
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్ట్ లకు తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజశేఖర్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్లు మంగళవారం సాయంత్రం బాపులపాడు తహసిల్దార్ మురళీకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తయినా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నాయకులు తక్షణం తమ హామీని నెరవేర్చా లని కోరారు. అక్రిడీటేషన్ కమిటీల్లో యూనియన్ ప్రతినిధులకు స్థానం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డులను, ప్రమాద బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పింఛన్ ఇచ్చి ఆడుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, మలిశెట్టి సుబ్రమణ్యం, పల్లెపు అంకమ్మ బాబు, చలమలశెట్టి శ్రీనివాసరావు, ధరావత్ హరికృష్ణ, కొమ్మూరి పవన్, కాలి కిరణ్, నల్లగంచు రామకృష్ణ, కత్తుల రమేష్, దారావత్ రాజగోపాల్, నూకల శ్రీకాంత్, ఆకుల లక్ష్మీ శ్రీనివాస్, నేమాల శ్రీధర్, లంక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here