ఎన్టీఆర్ జిల్లా, జులై 20, 2025
డ్యాన్స్ కాంపిటీషన్స్ పోస్టర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన పెంచేందుకు డ్యాన్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఆదివారం సాయంత్రం హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని పోటీలకు సంబంధించిన పోస్టర్ ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఆదివారం జూలై 27న హరిత బెరం పార్క్ లో డాన్స్ కాంపిటీషన్స్ ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రతి వయసు గల వారికి వివిధ కేటగిరీలు ఉంటాయని, మొదటి క్యాటగిరిలో 6 కంటే తక్కువ వయసు, ఏడు నుంచి పది వయసుగల వారు రెండో కేటగిరీ, 11 నుండి 15 వయసు గల వారు మూడో క్యాటగిరి, 16 సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉన్నవారు నాలుగో కేటగిరీలో డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సోలో మరియు గ్రూప్ పర్ఫామెన్స్ లు క్లాసికల్ మరియు జనరల్ క్యాటగిరిలలో ఈ పోటీ కేటగిరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు విజయవాడ నగర పాలక సంస్థ వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్ ను క్లిక్ చేసి, వివరాలు నింపి రిజిస్టర్ చేసుకోగలరని తెలిపారు. లేదా కోడ్ ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. చైతన్య, వెస్ట్ ఎమ్మార్వో షేక్ ఇంతియాజ్, విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.