డూండి గణేశుడిమూల విరాట్ కు ప్రత్యేక పూజలు

3
0

డూండి గణేశుడి
మూల విరాట్ కు ప్రత్యేక పూజలు

విద్యాధరపురం, లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 72 అడుగుల భారీ గణనాథుని మూలవిరాట్ కు ఆదివారం ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు..

ఎటువంటి విఘ్నాలు జరగకుండా చూసుకోవాలని విఘ్నేశ్వరుడిని వేడుకున్నారు..

ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొన్నారు
ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు..
గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా ప్రతి ఏటా విద్యాధరపురం, లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ గణనాధుని ప్రతిష్టించడం జరుగుతుంది.
ఈ విగ్రహాన్ని పర్యావరణ, అనుకూల పదార్థాలతో తయారు చేయడం విశేషం..
ఈ విగ్రహం చాలా పెద్దదిగా ఉండటంతో భారీ గణనాథుని చూడటానికి ప్రతి ఏటా భారీగా భక్తులు తరలివస్తారు..

ఈ కార్యక్రమంలో డూండి గణేష సేవా సమితి కమిటీ సభ్యులు కొత్త ముక్తేశ్వర రావు, దర్శి సుబ్బారావు, గడ్డం రవి ,సామా చైతన్య కూటమి నేతలు వల్లభనేని లక్ష్మీప్రసన్న, నున్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here