డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

6
0

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు

హైదరాబాద్ : ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. పార్టీలో వివిధ స్థాయిల్లో, సుదీర్ఘ కాలం పాటు  ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here