డివిజన్లలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు

Spread the love

 డివిజన్లలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు

పశ్చిమ నియోజకవర్గ డివిజన్లలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. జోనల్ కమిషనర్ బి రమ్య కీర్తన శానిటేషన్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి గురువారం 41 వ డివిజన్లోని సభాపతి రోడ్డు బాజీ బాబా మందిరం భగత్ సింగ్ రోడ్డు ఆశ్రమం రోడ్డు తదితర ప్రాంతాలలో పర్యటించారు. రోడ్లు పారిశుధ్య నిర్వహణ డ్రెయిన్లు తీరును పరిశీలించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సభాపతి రోడ్డు నుంచి స్వాతి థియేటర్ వైపునకు అనుసంధానంగా రోడ్డు ఏర్పాటు చేయమని స్థానికులు కోరగా కార్పొరేషన్ అధికారులతో చర్చించి రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు .బేతపూడి అరుణకుమారి వీధిలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల వర్షాలకు చెట్లు కూలిపోయాయని స్థానికులు తెలియజేశారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని జోనల్ కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య పాలనలో డివిజన్లలో పారిశుధ్యం అద్వాన్నంగా మారిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రజల వద్దకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నామని ప్రత్తిపాటి శ్రీధర్ తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు ఏఈ అహ్మద్ శానిటరి ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఏఈ రవీంద్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గ్రంథం ప్రసాద్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *