
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.17.11.2025
డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా సైబర్ సురక్షా కార్యక్రమం.
*సరికొత్త కార్యక్రమానికి నాంది వేసిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ *
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మరో ముందడుగు వేస్తూ బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రజల్లో అవగాహన తీసుకు వచ్చే విధంగా సైబర్ సురక్షా అనే సరికొత్త కార్యక్రమానికి నాంది వేశారు. సైబర్ సురక్షా పేరుతో నెలరోజుల పాటు ప్రజల్లో అవగాహన కోసం వివిధ కార్యక్రమాలు.
ఈ సందర్భంగా ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యాలయం నందు పోలీసు అధికారులకు మరియు సైబర్ చట్టలపై తర్ఫీదు పొందిన సిబ్బంది కి వారు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు ఏవిధంగా అవగాహన కల్పించాలి అనే విషయం గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో సైబర్ చట్టలపై తర్ఫీదు పొందిన 227 మంది సిబ్బంది నగరంలో ఉన్న 227 బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకులోని అదికారులతో కలిసి బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టు లపై అవగాహన కల్పించాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,..... పోలీసు కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి సురక్ష అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చాము దీనిలో ఎన్.టి.ఆర్ పోలీసు కమిషనరేట్ లో కమ్మునిటీని ఇన్ వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలతో దాదాపు 10 వేల కెమెరాలను ఏర్పాటు చేశాము, అదేవిధంగా సురక్షా డివైన్ అని ప్రతి దేవాలయం, ప్రతి చర్చ్ మరియు ప్రతి మసీదులో కూడా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఒక నేరం జరిగితే నేరస్థుడు కనీసం నాలుగు సి.సి.కెమెరాలలో అతని కదలికలను ఉండేటట్లు పోలీసు కమిషనరేట్ ఉందంటే మనం గర్వంగా చెప్పుకునే అవసరం ఉంది. మన చర్యలవలన 30 నుండి 40 శాతం క్రైమ్ రేట్ తగ్గింది. అధెవిధంగా ఎన్నడూ లేని విధంగా 80 శాతం రికవరీ ముందు ఉన్నాము. అధెవిధంగా ప్రమాదవశాత్తూ మరణాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజుకు 92 మరణాలను తగ్గించగలిగాము. ఒక వైపున క్రైమ్ ప్రివెన్షన్, మరో వైపున క్రైమ్ నేరాలను చేధించడం, మరొక వైపున ప్రమాదవశాత్తూ మరణాలు మరో వైపున మహిళల భద్రత మీద కొన్ని అవగాహానా కార్యక్రమాలు చేస్తున్నాము. పది వేల సీసీ కెమెరాలు డాష్ బోర్టులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
సైబర్ నేరాలు వివిధ రూపాలలో జరుగుతున్నాయి, పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి కదలికలపై దృష్టి పెట్టి దొంగలను పట్టుకుంటున్నాం, చైన్ స్నాచర్స్, బైట్ దొంగలు, గంజాయికి బానిసలుగా మారి చేస్తున్నట్లు గుర్తించాం, ఎప్పటికప్పుడు సిబ్బందికి వీటిపై అవగాహన కల్గిస్తూ చురుకుగా పని చేసేలా చేస్తున్నాం, నేడు సైబర్ క్రైం పెను సవాల్ గా మారింది. దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది, ప్రణాళిక బద్దంగా ముందుకు వెళితేనే. అటువంటి క్రైం ను నిరోధించే అవకాశం ఉంటుంది.
బ్యాంకర్స్ తో అనేక సార్లు సమావేశాలు ఏర్పాటు చేశాం. సైబర్ నేరగాళ్లు కరెంటు ఎకౌంట్లు ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడుతున్నాడని వివరించాం, సేవింగ్స్ ఎకౌంట్ నుంచి కరెంటు ఎకౌంట్ గా మార్చే ప్రతి ఖాతాను తప్పకుండా పరిశీలించాలని చెప్పాం, ఫాం ప్లేట్ లు కూడా ముద్రించి.. వారితో చదివించి.. వారిలో అవగాహన తీసుకు వచ్చాం, అక్కడక్కడకా కొంతమంది బ్యాంకర్ల సిబ్బంది నిర్లక్ష్యంతో నేరాలు జరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు చాలా వరకు నిరోధించగలిగామని.. యన్టీఆర్ జిల్లా పోలీసులుగా గొప్పగా చెబుతున్నాం,సైబర్ ప్రాస్టర్స్ ను కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, పోలీసుపరంగా తీసుకునే చర్యలకు... వారు ఎటువైపు నుంచి కూడా తప్పించుకోకూడదు, జీరో టాల్ రెన్స్ టుూ క్రైం, సైబర్ క్రైం అని సీఎం చెబుతుంటారు.. ఎటువంటి పరిస్థితులలో డిజిటల్ అరెస్టులు జరగకూడదు, నెల రోజుల పాటు సైబర్ సురక్షా అనే కార్యక్రమం తీసుకుని.. ప్రారంభిస్తున్నాం.
227 బ్యాంకులలో అవగాహన తీసుకు వచ్చేందుకు 227 టీం లు రేపటి నుంచి బాంకు ఉద్యోగులు, ఖాతాదారుల్లో మార్పు తీసుకు వస్తాం, ఉన్నతస్థాయిలో దీనిపై సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రణాళికలు సిద్దం చేశాం, ఒక చిన్న అప్లికేషన్ కూడా రూపొందించాం.. దీనిని చదివితే ప్రతి ఒక్కరికీ అర్దం అవుతుంది, ఇన్విస్టిమెంట్ మోసాలు కూడా బాగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది, అపరిచిత వ్యక్తులు ఆసక్తికరంగా చేసే ప్రకటనలు నమ్మి లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు, ఈ ఇన్విస్టిమెంట్ ఫ్రాడ్స్ నివారణకు పెద్ద యుద్దమే చేయల్సి ఉంటుంది, వీటిని నివారించేందుకు ఎలా ముందుకు సాగాలనే దానిపై ఆలోచన చేస్తున్నాం, ప్రాపర్టీ క్రైం నిరోధించడంలో పై చేయి సాధించినా.. వైట్ కాలర్ క్రైం, సైబర్ క్రైం లను నిరోధించాల్సి ఉంది, ఇందులో మా పోలీసు సిబ్బందికి కూడా అన్ని విధాలా శిక్షణ ఇస్తున్నాం, సైబర్ క్రిమినల్స్ కు తప్పకుండా ముక్కుతాడు వేస్తాం.. కాల్ సెంటర్ అరాచకాలపై దృష్టి పెడతాం, సైబర్ సురక్ష అనే స్లోగన్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లి.. సైబర్ నేరగాళ్ల ఆట కట్టిస్తాం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్., సైబర్ క్రైమ్ డి.సి.పి. కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్ రూరల్ డి.సి.పి. బి.లక్ష్మి నారాయణ ఐ.పి.ఎస్., ఇన్స్పెక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
![]()
